NIA Raids: దేశంలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు.. ప్రధాన కారణం అదే!

by Shiva |
NIA Raids: దేశంలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు.. ప్రధాన కారణం అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహమ్మద్‌ (Jaish-e-Mohammed)తో సంబంధాలు, ఉగ్రవాద ప్రచార వ్యాప్తిపై ఎన్‌ఐఏ (National Investigation Agency) ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ దేశ వ్యాప్తంగా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. జమ్ముకశ్మీర్, అసోం, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొత్తం 19 చోట్ల ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా భారత్‌ (India)లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహమ్మద్‌ (Jaish-e-Mohammed) ప్లాన్ చేసినట్లుగా కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్టు (Central Intelligence Report) అందడంతో తాజాగా ఎన్ఐఏ (NIA) సోదాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

కాగా, ఇటీవలే అక్టోబర్ 2న రాజస్థాన్ (Rajasthan)లోని మొత్తం 8 రైల్వే స్టేషన్ల (Railway Stations)లో బాంబులు అమర్చామంటూ జైషే-ఈ-మహమ్మద్‌ (Jaish-e-Mohammed) సంస్థ రాసిందనే లేఖ వార్తలు కలకలం రేపాయి. 2019లో జరిగిన పుల్వామా అటాక్‌ (Pulwama Attack)లో ఆ సంస్థ ప్రమేయం ఉన్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అనంతరం ఆ దాడులు చేసింది తామేనని జైషే-ఈ-మహమ్మద్ సంస్థ కూడా ప్రకటించించుకుంది. పుల్వామా అటాక్‌ (Pulwama Attack)లో 46 మంది భారత సైనికులను అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed