బ్రిటిష్ వాసన లేని భారతీయ న్యాయదేవత.. కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

by karthikeya |   ( Updated:2024-10-18 11:47:46.0  )
బ్రిటిష్ వాసన లేని భారతీయ న్యాయదేవత.. కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మనం బ్రిటిష్ న్యాయదేవత (లేడీ అఫ్ జస్టిస్) విగ్రహాన్నే భారత న్యాయదేవతగానూ భావిస్తూ వస్తున్నాం. కానీ ఈ పద్ధతికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వస్తి పలికారు. న్యాయస్థానం అనుమతితో బ్రిటిష్ న్యాయదేవత విగ్రహాన్ని తొలగింపజేసి ఆ స్థానంలో అచ్చమైన భారతీయ వేషధారణలో ఉన్న స్త్రీమూర్తి విగ్రహాన్ని న్యాయదేవతగా ఆవిష్కరించారు.

ఇన్నాళ్లూ ఉన్న బ్రిటిష్ న్యాయదేవత ఓ పలుచటి గౌను ధరించి, కుడిచేతిలో కొలతల త్రాచు, ఎడమ చేతిలో ఖడ్నాన్ని ధరించి ఉండేది. ఈ విగ్రహం కళ్లకు గంతలు కట్టి ఉండేవి. అంటే చట్టానికి కళ్లులేవని, చట్టం ముందు అందరూ సమానులే అని, బోనులో నిలబడిన వారి తప్పొప్పుల ఆధారంగా వారికి శిక్ష విధించడం జరుగుతుందనే ఉద్దేశాన్ని ప్రతిబింబించేది.

అయితే తాజాగా అమలులోకి తీసుకొచ్చిన న్యాయదేవత విగ్రహం పూర్తిగా స్వచ్ఛమైన తెలుపు రంగులో ఎలాంటి న్యాయవ్యవస్థలో స్వచ్ఛతను ప్రతిబింబిస్తోంది. సంప్రదాయబద్ధమైన చీరకట్టుతో తలపై కిరీటం, మెడలో ఆభయరణాలు ధరించి పూర్తి భారతీయ వేషధారణలో ఉంటుంది. ఈ విగ్రహం కూడా కుడి చేతిలో కొలతల త్రాచును పట్టుకుని ఉండగా.. ఎడమ చేతిలో మాత్రం రాజ్యాంగ గ్రంథాన్ని పట్టుకున్నట్లు ఉంటుంది. అంటే బోనులో నిలబడిన వారిని చూసి, పరికించి, వారి తప్పొ్పులను బేరీజు వేసి ఆ తర్వాత రాజ్యాంగ బద్ధంగా శిక్ష శిధించబడుతుందనే అర్థాన్ని ఈ విగ్రహం ప్రతిబింబిస్తోంది.


👉 Click Here For Video


Advertisement

Next Story

Most Viewed