- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లక్ష్యద్వీప్ ఎన్‌సీపీ నేత అనర్హత వేటుపై ట్విస్ట్..
న్యూఢిల్లీ: లక్ష్యద్వీప్ ఎన్‌సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వంపై బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైజల్ అనర్హత వేటు ఎత్తేస్తున్నట్టు.. ఆయన లక్ష్యద్వీప్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ జనరల్ బుధవారం ఉదయమే ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీంతో ఆయన సభా కార్యక్రమాలకు హాజరు కానున్నారు.
2009 సార్వ్రత్రిక ఎన్నికల సమయోంల కేంద్ర మాజీ మంత్రి పీఎం సయ్యద్ అల్లుడు మహ్మద్ సాలిహ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు ఫైజల్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2016 జనవరిలో ఆయనపై అండ్రోథ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ఈ కేసులో దోషిగా తేలిన ఫైజల్‌పై కవరత్తి కోర్టు ఈ ఏడాది జనవరి 11న పదేళ్ల కఠినకారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. దీంతో జనవరి 13న లోక్‌సభ సెక్రటేరియట్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.