KTR: బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన కంపెనీలకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలా.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-11-06 07:20:26.0  )
KTR: బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన కంపెనీలకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలా.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను అప్పగించిందని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లోని తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) హయాంలో శరవేగంగా పాలమూరు-రంగారెడ్డి (Pamamulu-Ranga Reddy) ఎత్తిపోతల పనులు శరవేగంగా కొనసాగాయని.. నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఏ సంస్థలను అయితే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులు చెప్పారో.. వారికే ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతోందని ఫైర్ అయ్యారు.

ప్రపంచంలో పేరుగాంచిన ఎల్ అండ్ టీ (L & T), NCC (Nagarjuna Construction Company)ని కాదని ఈస్ట్ ఇండియా కంపెనీ (East India Company), రాఘవ కన్ష్ట్రక్షన్ కంపెనీ (Raghava Construction)కి పనులు అప్పగించారని ధ్వజమెత్తారు. అందులో సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy), రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఎంత వాట ముట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్ట్‌ (Musi Project)ను కూడా మేఘా సంస్థకే అప్పగిస్తున్నట్లుగా తెలుస్తోందని అన్నారు. సుంకిశాల ఘటనకు కారణమైన ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆనాడు డిమాండ్ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టింకోకపోగా మళ్లీ అదే సంస్థకు మూసీ ప్రాజెక్ట్‌ను అప్పగించేందుకు సిద్ధమవడం దారుణమని ధ్వజమెత్తారు. నిత్యం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) జైలుకు పోతారని మాపై కామెంట్లు చేస్తున్నారని.. కుటుంబ కంపెనీలకు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి దండుకుంటూ.. మేము జైలుకు పోవాలా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Advertisement

Next Story