- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
US Electionsలో ట్రాన్స్‌జెండర్ గెలుపు.. దేశ చరిత్రలో తొలిసారి
దిశ, వెబ్‌డెస్క్: యూఎస్ ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ (US Elections) విజయం సాధించింది. యూఎస్ చరిత్రలోనే ఓ ట్రాన్స్‌జెండర్ (Transgender) ఎన్నికల్లో గెలవడం ఇదే తొలిసారి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా డెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుండి సారా మెక్‌బ్రైడ్ (Sarah McBride) బరిలో దిగి ఘన విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు సృష్టించింది. సారా మెక్‌బ్రైడ్‌కు పోటీగా రిపబ్లికన్ పార్టీ (Republican Party) తరపున జాన్ వేలెన్ పోటీ పడగా.. చివరికి సారానే విజయం వరించింది.
విజయం తర్వాత సదరు ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. ‘‘థాంక్యూ డెలవేర్. మీ ఓట్లు, విలువల వల్ల నేను గర్వంగా మన తరపున కాంగ్రెస్‌లో అడుగుపెడతాను’’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే తాను గెలిచింది కాంగ్రెస్‌లో చరిత్ర సృష్టించడం కోసం కాదని, డెలావేర్‌లో మార్పును తెచ్చేందుకని అనడం కొసమెరుపు.
ఇక పోతే జాతీయ ఎల్‌జీబీటీక్యూఏ+ (LGBTQA+) కార్యకర్తగా పనిస్తున్న సారా మెక్‌బ్రైడ్‌కు ఎన్నికల సమయంలో ఆ వర్గం నుంచి భారీ సపోర్ట్ దక్కింది. ఎన్నికల సమయంలో సారా ఏకంగా 30 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ప్రచార విరాళాలు సేకరించిందంటే ఇక అర్థం చేసుకోండి ఎంతలా సపోర్ట్ లభించిందో. ఇది కూడా సారా మెక్‌బ్రైడ్ విజయానికి ఉపయోగపడింది.
అయితే సారాకి ఇలా యూఎస్ ఎన్నికల్లో గెలవడం ఇది తొలిసారేమీ కాదు. డెలావేర్ నుండి 2020లో మొదటి ట్రాన్స్‌స్టేట్ సెనేటర్ అయిన వ్యక్తిగా కూడా సారా రికార్డు సృష్టించారు. 2010 నుండి, డెలావేర్ ఓటర్లు డెమొక్రాట్ (Democrats)లకు మద్దతిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూఎస్ ఎలక్షన్స్‌లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trupm) దూసుకుపోతున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల సమాయానికి ట్రంప్ 247 స్థానాలలో ముందజలో ఉండగా.. కమలా హారిస్ (Kamala Harris) 215 స్థానాలతో వెనుకపడి ఉంది.