Supreme Court: ఆ లైసెన్స్ ఉన్నా ట్రాన్స్ పోర్టు వాహనాలు నడుపొచ్చు.. సుప్రీంకోర్టు గుడ్ న్యూస్

by Prasad Jukanti |
Supreme Court: ఆ లైసెన్స్ ఉన్నా ట్రాన్స్ పోర్టు వాహనాలు నడుపొచ్చు.. సుప్రీంకోర్టు గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లైట్ మోటర్ వెహికిల్ (ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్స్ దారులకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ లైసెన్స్ కలిగిన వారు కూడా 7,500 కేజీల కంటే తక్కువ బరువున్న ట్రాన్స్ పోర్టు వాహనాన్ని నడపడానికి అర్హులేనని బుధవారం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో కమర్షియల్ వెహికల్స్ డ్రైవర్లకు ఊరట లభించినట్లయింది. బీమా కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌లు ఎల్‌ఎంవీ లైసెన్స్ హోల్డర్లు ఎక్కువ ప్రమాదాలకు కారణమయ్యాయని ఎటువంటి అనుభావిక రుజువును అందించడంలో విఫలమయ్యాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎల్ఎంవీ లైసెన్సులు కలిగిన వారు రవాణా వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడితే అలాంటి కేసుల్లో బీమా కంపెనీల క్లెయిమ్‌ల చెల్లింపుపై చట్టపరమైన ప్రశ్న అనేక వివాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై గతంలో విచారణ జరిపిన కోర్టు ఆగస్టు 21న తీర్పును రిజర్వులో ఉంచింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు వాదించారు. మోటారు వాహనాల (MV) చట్టం, 1988ని సవరించడానికి సంప్రదింపులు దాదాపు పూర్తయ్యాయని, ప్రతిపాదిత సవరణలు ఇంకా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి, ఇది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే సాధ్యమవుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Next Story