SI Karunakar Reddy : రోడ్ల పై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దు.. ఎస్సై కరుణాకర్ రెడ్డి

by Sumithra |
SI Karunakar Reddy : రోడ్ల పై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దు.. ఎస్సై కరుణాకర్ రెడ్డి
X

దిశ, వర్గల్ : సాధ్యమైనంత వరకు రోడ్ల పై ధాన్యాన్ని పోయవద్దని గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై బి.కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్ల పై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాల్లో అది గమనించక ప్రమాదం జరిగి చనిపోతున్నారన్నారు. బావి దగ్గర ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ఏర్పాటు చేసుకోవాలి, నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దన్నారు.

రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని మోటార్ సైకిల్ వాహనదారులు వాటిని తగిలి మృత్యువాత పడుతున్నారన్నారు. రోడ్లపై ధాన్యం పోయవద్దని పోలీస్ అధికారులు, సిబ్బంది కూడా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed