- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
2024 US Election Results Live Updates: అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ హవా
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఈ ఫలితాల్లో ఆయన మ్యాజిక్ ఫిగర్‌కు మరింత చేరువయ్యారు. అమెరికా ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. గెలిచేందుకు 270 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల (US Election Results) ప్రకారం.. ట్రంప్ (Donald Trump) 248 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) 214 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. ట్రంప్ 23 రాష్ట్రాల్లో విజయంసాధించారు. అంతేకాకుండా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కూడా ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమె 11 రాష్ట్రాల్లో విజయం సాధించారు.
స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ హవా
అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లోని జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాలు ట్రంప్ (Republican Party) వశమయ్యాయి. దీంతో పాటు మరో ఐదు స్వింగ్ స్టేట్స్‌లో ఆయనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియాలో తొలుత హారిస్ జోరు కనబడగా.. ప్రస్తుతం ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మిగతా స్వింగ్ స్టేట్స్ నెవడా, మిషిగన్, ఆరిజోనా, విస్కాన్సిన్‌లోనూ ముందంజలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన జార్జియా, కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, నార్త్ కరోలినా రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఇక, కమలా హ్యారిస్ కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్, కొలరాడో, హవాయి, న్యూహ్యాంప్‌షైర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను సొంతం చేసుకున్నారు.
ప్రసంగాన్ని రద్దు చేసుకున్న కమల
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్ది ట్రంప్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. కమలా హ్యారిస్ వెనుకంజలో ఉండటంతో.. హార్వర్డ్ యూనివర్సిటీ వాచ్ పార్టీలో ఇవ్వాల్సిన తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఇవాళ కమలా ప్రసంగించరని, రేపు మాట్లాడతారని ఆమె ప్రచార బృంద సభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ వెల్లడించారు.
- Tags
- Donald Trump