- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : కులగణనలో భాగంగా ఎమ్మెల్యే గాంధీ ఇంటికి స్టిక్కర్..
దిశ, శేరిలింగంపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం కూకట్ పల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని వివేకానంద నగర్ లో అధికారులు సర్వే చేపట్టారు. తొలిరోజు అధికారులు సప్తగిరి కాలనీలో గల పీఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి వారి ఇంటికి స్టిక్కర్ అంటించారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కులగణన చేపట్టిందని, బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన కులాల జాబితాను సిద్ధం చేసి అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా మంచి నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని అన్నారు. అధికారులు ఖచ్చితత్వంతో కూడిన సర్వే నిర్వహించాలని, ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు కూడా కులగణన చేస్తున్న అధికారులకు సహకరించి నిజాలు మాత్రమే చెప్పాలని, అప్పుడే సరైన కుల జాబితా రూపొందుతుందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.