- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Raw Banana : పచ్చి అరటితో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది డయాబెటిస్ తో బాధ పడుతుంటారు. పచ్చి అరటిలో షుగర్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే, దానిలో రెసిస్టెంట్ స్టార్చ్ కూడా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. పచ్చి అరటిలో ( Raw Banana ) గ్లైసెమిక్ ఇండెక్స్ 30 ఉంటుంది. అందుకే డాక్టర్స్ దీనిని తినమని చెబుతుంటారు. మధుమేహం సమస్య మాత్రమే కాకుండా మిగతా సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
జీర్ణక్రియ
పచ్చి అరటిలో బౌండ్ ఫెనోలిక్స్ అధికంగా ఉంటుంది. ఇవి ప్రో బయోటిక్ ఎఫెక్ట్ కల్గిస్తాయి. దాంతో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
బరువు
చాలామంది బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, వారికీ మాత్రం ఫలితం ఉండటం లేదు. ఆశించిన ఫలితాలు సాధించలేకపోతుంటారు. అయితే, పచ్చి అరటి ఉండే ఫైబర్ కారణంగా క్రమంగా బరువు తగ్గుతారు.
గుండె ఆరోగ్యం
అరటిలో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎందుకంటే, దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.