- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
China Masters : సెమీస్‌లో సాత్విక్ జోడీ ఓటమి
దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ షట్లర్లు సాత్విక సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిల పోరాటం ముగిసింది. టైటిల్ దిశగా సాగిన ఈ జోడీ ప్రయాణానికి సెమీస్‌లో బ్రేక్ పడింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 18-21, 21-14, 16-21 తేడాతో సౌత్ కొరియాకు చెందిన జిన్ జియోంగ్-సీయో సీయుంగ్ జే ద్వయం చేతిలో పోరాడి ఓడింది. పారిస్ ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాత సాత్విక్, చిరాగ్ బరిలోకి దిగిన టోర్నీ ఇదే. టోర్నీలో సత్తాచాటిన భారత జంట సెమీస్‌లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌ను చేజేతులా కోల్పోయింది. 16-12తో ఆధిక్యంలో ఉన్న స్థితి నుంచి వరుసగా పాయింట్లు కోల్పోయి తొలి గేమ్‌ను ప్రత్యర్థికి సమర్పించుకుంది. అయితే, రెండో గేమ్‌లో సాత్విక్ జోడీ పుంజుకుంది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించి రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు మళ్లించింది. కానీ, అక్కడ భారత షట్లర్లు సౌత్ కొరియా ప్లేయర్ల దూకుడును అడ్డుకోలేక మ్యాచ్‌ను కోల్పోయారు. సాత్విక్, చిరాగ్ జోడీ నిష్ర్కమణతో టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. పీవీ సింధు, లక్ష్యసేన్ ఇప్పటికే ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే.