పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించొద్దు

by Sridhar Babu |
పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించొద్దు
X

దిశ, ఆసిఫాబాద్ : పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా పోలీసులు వ్యహరించవద్దని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కెరమెరి పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పోలీస్ శాఖ మంజూరు చేసిన కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు.

స్టేషన్ లోని పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల వివరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, కోర్ట్ లో పెండింగ్ లో ఉన్న కేసులు, వాటికి సంబంధించిన దర్యాప్తు వివరాలను ఎస్ఐ ను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని, కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్పీతో డీఎస్పీ కరుణాకర్, సీఐ సత్యనారాయణ, ఎస్ఐ విజయ్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed