- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
దిశ, ఎల్లారెడ్డి : ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలం మీసాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరుగుతుందని, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్లు మంజూరు చేయడానికి సర్వే చేపడుతున్నామని తెలిపారు. స్వంత భూమి ఉండి నిరుపేదలైన వారి వివరాలు, ఫోటోలు, భూముల వివరాలు, సేకరించి యాప్ లో పొందుపరుస్తున్నామని తెలిపారు. సర్వేయర్లు ఇండ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పకడ్బందీగా, పక్కాగా సేకరించి యాప్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. సర్వే పనులను వేగవంతం చేయాలని,రోజుకు కనీసం 30 నుండి 40 వరకు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, నాయాబ్ తహసీల్దార్ చరణ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.