- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PKL : తెలుగు టైటాన్స్ జోరుకు బ్రేక్.. గుజరాత్ చేతిలో పరాజయం
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత ఓటమి చవిచూసింది. శనివారం నోయిడాలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 31-28 తేడాతో పోరాడి ఓడిపోయింది. ఇరు జట్లు మొదటి నుంచి పాయింట్ల కోసం పోటీపడటంతో మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అయితే, ఆశిశ్ నర్వాల్ సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు తేవడంతో టైటాన్స్ ఫస్టాఫ్‌లో 17-15తో స్వల్ప ఆధిక్యం సాధించింది. సెకండాఫ్‌లో కాసేపటకే టైటాన్స్ ఆలౌటవడంతో ఆ జట్టు 20-17తో వెనుకబడింది. ఆ తర్వాత చాలా సేపు గుజరాత్ స్వల్ప లీడ్‌లో ఉంది. ఈ సమయంలో విజయ్ మాలిక్, ఆశిశ్ నర్వాల్ పోరాటంతో టైటాన్స్ 26-26తో స్కోరును సమం చేసింది. అయితే, ఆఖర్లో గుజరాత్ ఆధిక్యంలోకి వెళ్లి విజేతగా నిలిచింది. పీకేఎల్ చరిత్రలో టైటాన్స్‌పై గుజరాత్‌కు ఇది 10 విజయం. ప్రతీక్ దహియా(11 పాయింట్లు) గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించగా.. టైటాన్స్ తరపున విజయ్ మాలిక్(15 పాయింట్లు) పోరాటం వృథా అయ్యింది. మ్యాచ్ కోల్పోయినప్పటికీ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానాన్ని కాపాడుకుంది.