Bhatti Vikramarka: జార్ఖండ్ లో గెలుపు ఇండియా కూటమి సమిష్టి విజయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Maddikunta Saikiran |
Bhatti Vikramarka: జార్ఖండ్ లో గెలుపు ఇండియా కూటమి సమిష్టి విజయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్(Jharkhand) రాష్ట్రంలో తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు అందరి సమిష్టి విజయమని డిప్యూటీ సీఎం(Dy.CM) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. ఇక్కడ బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, వారి కొనుగోలు జిమ్మిక్కులు ఇక్కడ సాగవని నొక్కి చెప్పారు. తమ ఎమ్మెల్యేలు పార్టీ ,భావజాలం పట్ల కమిట్మెంట్ తో ఉన్నారని గుర్తు చేశారు. శనివారం ఆయన రాంచీ(Ranchi)లో మాట్లాడుతూ.. జార్ఖండ్ మైన్స్, మినరల్స్ ఈ రాష్ట్ర ప్రజలకే చెందాలని.. అదానీ, అంబానీ వంటి క్రోనీ క్యాపిటలిస్టులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దని సూచించారు. తమ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారని, సంవిధాన్ సమ్మేళన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ దాని ద్వారా వచ్చిన హక్కులను కాపాడుతామని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం సంపద, ఆస్తులు సమానంగా పంచబడాలని మన భారత రాజ్యాంగం చెబుతుందన్నారు. తమ పార్టీ నాయకత్వం వివరంగా ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అయిందన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి గత ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులు, మరోసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనే అంశాలపై బడ్జెట్ అంకెలు, సంఖ్యలతో వివరంగా చెప్పామన్నారు. తమ కూటమి నేతల మాటలను ప్రజలు విశ్వసించారన్నారు.

రాహుల్ గాంధీ(Rahul Gandhi), హేమంత్ సోరేన్(Hemant Soren) వంటి యువ నాయకులు, ఖర్గే(Kharge) లాంటి అనుభవం కలిగిన వ్యక్తుల సారథ్యంలోని ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు ఉంటే మంచిదన్నారు. వీరిని కాకుండా క్రోని క్యాపిటల్స్, బహుళ జాతి సంస్థలకు ఈ రాష్ట్ర సంపాదనను కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. ఇండియా కూటమి గెలిస్తే బంగ్లాదేశ్ నుంచి వలసలు వెల్లువెత్తుతాయని, చొరబాటుదారులు పెరుగుతారని బీజేపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. చొరబాటు దారులను నియంత్రించాల్సింది సరిహద్దుల్లోని బీఎస్ఎఫ్ అని గుర్తు చేశారు. ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ చేతిలో ఉందని, వారి వైఫల్యం మూలంగానే చొరబాటు దారులు పెరుగుతున్నారన్నారు. ఇక ఇండియా కూటమిపై విశ్వాసం ఉంచి మరోసారి ప్రజల, పేదల అనుకూల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు జార్ఖండ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుత తీర్పు కోసం శ్రమించిన ఇండియా కూటమి అభ్యర్థులందరికీ అభినందనలన్నారు. ఏడు హామీల ద్వారా జార్ఖండ్ హక్కుల పరిరక్షణకు, జార్ఖండ్ భవిష్యత్తు భద్రతకు కట్టుబడి ఉన్న నాయకత్వంపై అచంచలమైన నమ్మకాన్ని ఈ తీర్పు ప్రతిబింబిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed