- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Punjab : ‘భారత్ మాల’ ప్రాజెక్టుకు భూములు.. పోలీసులతో వందలాది రైతుల ఘర్షణ
దిశ, నేషనల్ బ్యూరో : ‘భారత్‌మాల’ హైవే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం సేకరించిన తమ భూములకు(Land Acquisition) సరైన పరిహారాన్ని ఇవ్వలేదంటూ పంజాబ్(Punjab)లోని భటిండా జిల్లా రైతులు నిరసనకు దిగారు. మైసర్ ఖానా గ్రామంలో వందలాది రైతులు సమావేశమయ్యారు. భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రాహన్ అనే రైతు సంఘం ఆధ్వర్యంలో వారంతా భేటీ అయ్యారు. సమావేశం ముగియగానే అందరూ కలిసి వాహనాల్లో దునేవాలా గ్రామం వైపుగా బయలుదేరారు. మార్గం మధ్యలో సంగ్రూర్ అనే మరో గ్రామానికి చెందిన రైతులు కూడా వారికి తోడు కలిశారు. కేంద్ర ప్రభుత్వం తమ నుంచి కొన్న దునేవాలా గ్రామంలోని భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రైతులంతా ముందుకు కదిలారు.
ఈక్రమంలో సంగ్రూర్ వద్ద పోలీసుల బ్యారికేడ్లను నిరసనకారులను పక్కన పడేశారు. అక్కడున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. రైతులను అక్కడి నుంచి వెనక్కి పంపేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘటనల్లో ఆరుగురు పోలీసు సిబ్బందికి, డజన్ల కొద్దీ రైతులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా ఉగ్రాహన్ నాయకులు మాట్లాడుతూ.. భారత్ మాల ప్రాజెక్టు కోసం కొన్ని గ్రామాల రైతుల నుంచి ఎక్కువ ధరకు, కొన్ని గ్రామాల రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొన్నారని ఆరోపించారు. అయితే ఈ వాదనను అధికారులు ఖండించారు. హైవే పక్కనున్న భూములకు ఎక్కువ ధరను, మారుమూల ప్రాంతాల్లో ఉన్న భూములకు తక్కువ ధరను ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు.