- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Damodara Rajanarsimha: ఫైర్ సేఫ్టీ మెజర్స్‌పై ఉన్నతాధికారులతో హెల్త్ మినిస్టర్ రివ్యూ
దిశ, తెలంగాణ బ్యూరో: ఫైర్ సేప్టీ(Fire Safety) తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పది టీంలను రెడీ చేసింది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర పెద్దాసుపత్రులను నిత్యం తనిఖీ చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా(Damodara Rajanarsimha) ఆదేశించారు. ప్రభుత్వ(Govt), ప్రైవేట్(Private) హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ మెజర్స్‌పై ఆయన శనివారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇటీవల ఉత్తర ప్రదేశ్(UP)లోని ఓ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అదికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి, నివేదిక తయారు చేయాలని సూచించారు.
తొలుత గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఫైర్ అలార్మ్స్, స్మోక్ట్ డిటెక్టర్స్ ఉన్నదీ, లేనిది పరిశీలించాలన్నారు. మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో? లేవో చూడాలని, వాటి తుది గడువు తేదీలను చెక్ చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ, మంటలను ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటళ్లలో పనిచేసే సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. హాస్పిటళ్లలో పవర్ సప్లై సిస్టమ్‌ను పరిశీలించాలని, పాత ఎలక్ట్రిక్ కేబుల్స్ ఉంటే, వాటి స్థానంలో నాణ్యమైన కొత్త కేబుల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ, షార్ట్ సర్క్యూట్‌కు సంబంధించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటల్‌కు సమీపంలోని ఫైర్ స్టేషన్ సిబ్బందితో హాస్పిటల్ అధికారులు టచ్‌లో ఉండాలని, హాస్పిటల్స్‌లో రెగ్యులర్‌గా ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి హాస్పిటల్‌కు ఫైర్ ఎవక్యూషన్ ప్లాన్ రూపొందించాలని, ఆ ప్లాన్‌పై డాక్టర్లు, స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.