కెనడా ఇంటెలీజెన్స్ అధికారులే క్రిమినల్స్ : కెనడా ప్రధాని ట్రూడో

by Hajipasha |
కెనడా ఇంటెలీజెన్స్ అధికారులే  క్రిమినల్స్ : కెనడా ప్రధాని ట్రూడో
X

దిశ, నేషనల్ బ్యూరో : కెనడా(Canada) ప్రభుత్వ ఇంటెలీజెన్స్ అధికారులపై సాక్షాత్తూ ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో(Trudeau) ఫైర్ అయ్యారు. ‘‘కెనడాలో జరిగిన హింసాత్మక ఘటనలతో భారత(India) ప్రధానమంత్రి నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లకు ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేసిన ఇంటెలీజెన్స్ అధికారులే క్రిమినల్స్’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ ఆ క్రిమినల్స్ (కెనడా ఇంటెలీజెన్స్ అధికారులు) టాప్ సీక్రెట్ సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నారు. అయితే వాళ్లు లీక్ చేస్తున్నదంతా తప్పుడు సమాచారమే. దానితో మీడియా అడ్డదిడ్డంగా కథనాలు వండి వారుస్తోంది. మీడియా అలా చేయడం ముమ్మాటికీ తప్పే’’ అని ఆయన విమర్శించారు.

ఇటీవలే ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ అనే కెనడా వార్తాపత్రికలో ఒక సంచలన కథనం ప్రచురితమైంది. కెనడా నిఘా వర్గాల సమాచారం అని పేర్కొంటూ పబ్లిష్ చేసిన ఆ కథనంలో.. ‘‘కెనడాలో జరిగిన పలు హింసాత్మక ఘటనల సమాచారం ముందే భారత ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్, ఎన్ఎస్‌ఏ అజిత్ దోవల్‌లకు తెలుసు’’ అని ప్రస్తావించారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన కెనడా విదేశాంగ శాఖ.. ఆ వార్తలో ప్రస్తావించిన అంశాలన్నీ తప్పులే అని వెల్లడించింది. కెనడా ఇంటెలీజెన్స్ విభాగాలకు అలాంటి సమాచారమేదీ అందలేదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed