- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాన్ని మార్చలేరు: చైనా తీరును ఖండించిన భారత్
దిశ, నేషనల్ బ్యూరో: అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాల పేర్లను చైనా మార్చడంపై భారత్ స్పందించింది. భూభాగాలకు కొత్త పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాన్ని మార్చ లేరని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా వ్యవహరిస్తున్న తీరు అర్థం లేనిదని తెలిపింది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగమేనని దానిని ఎవరూ విడదీయలేరని తేల్చి చెప్పింది. ‘భారత్‌లో అంతర్భాగంగా ఉన్న స్థలాల పేరు మార్చడం చైనా కొనసాగించింది. ఇదొక తెలివిలేని చర్య. ఈ ప్రయత్నాలను భారత్ తిరస్కరిస్తుంది. పేర్లను పెట్టడం వల్ల వాస్తవాలను మార్చలేరు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను మారుస్తున్నట్టు చైనా పౌర మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత్ దీనిపై స్పందించి కౌంటర్ ఇచ్చింది. అంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజులు కూడా చైనా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.