- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral video: దమ్ మారో దమ్ .. జూలో గొరిల్లా చేసిన పనికి నెటిజన్లు ఫైర్

దిశ, వెబ్ డెస్క్: కొన్ని జంతువులు అచ్చం మనుషుల్లానే ప్రవర్తిస్తుంటాయి. అందులో గొరిల్లాలు (Gorilla) ముందుంటాయి. మనుషుల్లానే ఆలోచిస్తూ, మనుషుల్లానే అన్ని రకాల పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో (Social media) తరచూ వైరల్ అవ్వటం చూస్తుంటాం. ఇక తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ గొరిల్లా మనుషులా మాదిరిగా సిగరేట్ (Smoking) తాగుతూ కనిపించింది. ఇది చూసిన జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చైనాలోని గ్వాంగ్జీలోని నానింగ్ జూలో (Naning zoo in china) ఈ ఆశ్యర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.
జూలోని ఓ గొరిల్లా మనిషిలా సిగరెట్ తాగటం గమనించిన ఒక సందర్శకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. నేలపై కూర్చొని గొరిల్లా హాయిగా పొగ తాగుతుంది. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు జూ సిబ్బందిపై మండిపడుతున్నారు. స్మోకింగ్ చేయటం వల్ల మనుషులు ఎన్ని అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారో తెలిసిందే. ఇప్పుడూ గొరిల్లా చేతిలో సిగరేట్ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఇదేం ఫన్నీ విషయం కాదని, అసలు గొరిల్లాకు సిగరేట్ ఎక్కడి నుంచి వచ్చిందని కామెంట్లులో ప్రశ్నిస్తున్నారు. మనుషుల తప్పులకు జంతువులు కూడా బలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, వీడియో వైరల్ అవ్వటంతో జూ సిబ్బంది ఈ ఘటనపై స్పందించింది. గొరిల్లా సిగరేట్ తాగిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సందర్శకులు ఎవరైనా పొరపాటున పడేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై కమిటీ వేసి విచారణ చేపట్టినట్లు వివరించారు. విచారణలో కావాలనే గొరిల్లా దగ్గర సిగరేట్ వేశారని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోకుండా భద్రతాను మరింత కట్టుదిట్టం చేస్తామని పేర్కొన్నారు.