- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈనెల 30న హుజూర్ నగర్ రానున్న సీఎం.. ఇక్కడి నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

దిశ, హుజూర్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 30 నుంచి రేషన్ కార్డుదారులకు సివిల్ సప్లై ద్వారా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వేదిక కానుంది. ప్రభుత్వం ఈ ఇక్కడినుండే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతోపాటు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరు కానున్నారు.దీన్ని సంబంధించిన పనులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ జిల్లా ఎస్పీ నరసింహ తో కలిసి జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సభ జరిగే ప్రాంగణం పరిశీలిస్తూ హెలిప్యాడ్ దిగే వద్ద విద్యుత్ స్తంభాలు తొలగించి ఆ లైన్ లో ఉన్న విద్యుత్ సరఫరా ను వేరే రూట్ లో సరఫరా చేయాలని , హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు అప్రోచ్ రోడ్డును వేయాలని,బారికేడ్లు నిర్మించాలని కలెక్టర్ తెలిపారు.విఐపి, అధికారుల పార్కింగ్ లను పరిశీలించారు.హెలిప్యాడ్ ను, అప్రోచ్ రోడ్డు ఈనెల 27 సాయంత్రం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు ఎక్కువగా వస్తారు కాబట్టి ట్రాఫిక్ సమస్య లేకుండా పలు చోట్ల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.పార్కింగ్ స్థలాలకి వెళ్లే రోడ్లలో గుంటలు పూడ్చి,రోలింగ్ ద్వారా చదును చేయాలని, దారి పొడువునా ఏమైనా చెట్ల కొమ్మలు అడ్డు వస్తే తొలగించాలని, పార్కింగ్ లో ప్లడ్ లైట్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి పార్కింగ్ లో రెండు దారులు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి సూచించారు.
అధికారులతో సమీక్షించిన కలెక్టర్..
సీఎం సభ ఏర్పాట్లకు సంబంధించి హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెలిప్యాడ్, పార్కింగ్, వీఐపీలకు ప్రోటోకాల్,సభ వేదిక వద్ద తహసీల్దార్ లకి ఇంచార్జి విధులు కేటాయించామని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఎండాకాలం కాబట్టి ప్రజల కోసం చల్లని తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని ప్రతి సెక్టార్ కి ఎంపిడిఓ /ఎంపీఓ ఇంచార్జి గా ఉంటూ పంచాయతీ సెక్రటరీలను సపోర్ట్ గా ఉంచుకుంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో సభకు వచ్చిన ప్రజలకు తాగునీరు, మజ్జిగ అందజేయాలని తెలిపారు.
అధికారులు ఐడీ కార్డులు ధరించాలని అన్నారు. సమాచార శాఖ ద్వారా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు శ్రీనివాసులు సూర్యనారాయణ, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సీఐ చరమంద రాజు స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగభూషణం విద్యుత్ శాఖ డీఈ వెంకట కృష్ణయ్య ఆర్ అండ్ బీడీ ఈ రమేష్ తహసీల్దార్లు నాగార్జున రెడ్డి,కమలాకర్, మంగా, జ్యోతి, కవిత, సైదులు, సురేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు ఎరగని నాగన్న గౌడ్ తన్నీరు మల్లికార్జున్ శ్రీనివాస్ రెడ్డి ఎస్సైలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.