విధులకు వెళ్తూ అనంతలోకాలకు

by Sridhar Babu |   ( Updated:2025-03-25 12:57:43.0  )
విధులకు వెళ్తూ అనంతలోకాలకు
X

దిశ, తిరుమలగిరి : హైటెక్ సిటీలో విధులు నిర్వర్తించడానికి వెళ్తున్న అల్వాల్ కు చెందిన మహిళ ప్రమాదవశాత్తు మంగళవారం బస్సు వెనుక టైరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తిరుమలగిరి సీఐ నాగరాజు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం త్రివేణి కుమారి సోని (40) అనే మహిళ రోజులాగే విధులకు వెళ్తూ లాల్ బజార్ బస్ స్టాప్ కు వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి ఇంటర్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు.

Next Story

Most Viewed