మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయండి: MP రాహుల్ గాంధీ డిమాండ్

by Satheesh |   ( Updated:2023-09-20 13:01:00.0  )
మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయండి: MP రాహుల్ గాంధీ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమర్థించారు. బుధవారం లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల కల్పించే బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని అన్నారు. జనాభా లెక్కలు, డిలీమిటేషన్ ప్రక్రియను.. మహిళ బిల్లు అమలు వేళ ఇప్పుడే ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని.. ఈ బిల్లులో ఓబీసీ రిజర్వేషన్లు ప్రస్తావించలేదన్నారు. మహిళా బిల్లుపై బీజేపీ అందరిని తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. కులగణన చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ వర్గాల పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఇప్పుడున్న వ్యవస్థల్లో ఓబీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి మారుతుంటే దేశ ప్రథమపౌరులైన రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని బీజేపీని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed