Modi Ukraine Tour: మోడీ కీవ్ పర్యటనపై ప్రపంచదేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి

by Shamantha N |
Modi Ukraine Tour: మోడీ కీవ్ పర్యటనపై ప్రపంచదేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ కీవ్‌ పర్యటన శాంతియుత పరిష్కారానికి దోహదపడుతుందని వైట్‌హౌస్ పేర్కొంది. మోడీ ఉక్రెయిన్ పర్యటనపై ప్రపంచదేశాల ఆసక్తి కనబరుస్తున్నాయని వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ ను అమెరికాకు బలమైన భాగస్వామిగా పేర్కొంది. ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలికే ఏ ఇతరదేశమైనా అమెరికా స్వాగతిస్తుందంది. ఈ పర్యటన ద్వారా రష్యా, ఉక్రెయిన్‌ సంఘర్షణకు ముగింపు పలికినట్లయితే.. అది బాగా ఉపయోకరంగా ఉంటుందని భావిస్తున్నామని అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించారు. ఇది ఎంతో ముఖ్యమైనదని.. ప్రపంచ దేశాలు మోడీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. ఇకపోతే, 1992లో ఉక్రెయిన్‌తో భారత్ దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. కాగా.. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని శనివారం ఉదయం ప్రధాని మోడీ భారత్ చేరుకున్నారు.

జెలెన్ స్కీతో భేటీ

శుక్రవారం ఉదయం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ లో శాంతి కోసం ప్రతి ప్రయత్నంలో భారత్ తోడుంటుందని జెలెన్ స్కీకి హామీ ఇచ్చారు. చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్ కి పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో భారత్ తటస్థంగా లేదని.. శాంతివైపే ఉందన్నారు. గత నెలలో మాస్కో వెళ్లిన మోడీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు. చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కారం లభిస్తుందని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed