మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్..12 మంది మావోయిస్టులు మృతి

by vinod kumar |
మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్..12 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుకు సమీపంలోని వందోలి గ్రామంలో 15 మంది నక్సలైట్లు క్యాంప్ వేసినట్టు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందింది. దీంతో డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలోని సీ-60 పార్టీకి చెందిన పోలీసులు వందోలీ గ్రామంలో బుధవారం కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దాదాపు 6 గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో 12 మంది నక్సలైట్లు మరణించగా..సీ-60కి చెందిన ఒక సబ్-ఇన్‌స్పెక్టర్, ఒక జవాన్‌కు బుల్లెట్ తగిలి గాయాలయ్యాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు గాయపడిన వారిని నాగ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఘటనా స్థలంలో మూడు ఏకే 47లు, 2 ఇన్సాస్, 1 కార్బైన్, ఒక ఎస్‌ఎల్‌ఆర్ సహా ఏడు ఆటోమోటివ్ ఆయుధాలు లభ్యమయ్యాయి. మృతుల్లో దళం ఇన్‌చార్జి డీవీసీఎం లక్ష్మణ్‌ ఆత్రం అలియాస్‌ విశాల్‌ ఆత్రంగా పోలీసులు గుర్తించారు. మిగతా 11 మందిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed