- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manipur: మణిపూర్‌లో మరో దారుణం.. మహిళను కాల్చి చంపిన మిలిటెంట్లు
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. ఇటీవల జిరిబామ్ జిల్లాలో మైతీ తిరుగుబాటు దారులు ఓ 31 ఏళ్ల గిరిజన మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి తేరుకోకముందే మరో మహిళను మిలిటెంట్లు కాల్చి చంపారు. బిష్ణుపూర్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మైతీ కమ్యూనిటీకి (Maithee community) చెందిన జోసాంగ్కిమ్ హ్మార్ అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి పొలాల్లో పని చేస్తుండగా కుకీ మిలిటెంట్లు (Kukee militants) కొండపై నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. కాగా, గతేడాది మే నుంచి మణిపూర్‌లో కుకీ, మైతీ తెగల మధ్య అల్లర్లు జరుగుతుండటంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 200 మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల ఇరు వర్గాల ఎమ్మెల్యేలతో కేంద్రం భేటీ అయినప్పటికీ అల్లర్లు అదుపులోకి రాలేదు.