- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య ఆత్మహత్య కేసులో 30 ఏళ్ల తర్వాత భర్తకు ఉపశమనం
దిశ, నేషనల్ బ్యూరో: భార్య ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ భర్తకు 30 ఏళ్ల తర్వాత భారత అత్యున్నత న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వేధింపులు లేదా క్రూరత్వానికి తగిన సాక్ష్యాధారాలు లేని పక్షంలో తన భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని దోషిగా నిర్ధారించలేమని సదరు వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది. హర్యానాకు చెందిన నరేష్ కుమార్ 1992లో వివాహం చేసుకున్నాడు. వివాహమైన తర్వాత రేషన్ దుకాణాన్ని ప్రారంభించాలనే కారణంతో అతని తల్లిదండ్రులతో కలిసి డబ్బు కోసం అతని భార్యను డిమాండ్ చేశాడు. అనంతర పరిణామాల్లో నవంబర్ 18, 1993న మహిళ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదైంది. నరేష్‌పై ఐపీసీ సెక్షన్ 306(ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత 1996లో ట్రయల్ కోర్టు నరేష్‌ను దోషిగా నిర్ధారించింది. దీని అతను పంజాబ్, హర్యానా కోర్టులకు వెళ్లినప్పటికీ ఫలితల్ దక్కలేదు. హైకోర్టు కూడా ట్రయల్స్ కోర్టు తీర్పును సమర్థించింది. దాంతో 2008లో నరేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును, శిక్షణ రద్దు చేసి, నరేష్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
'మహిళ ఆత్మహత్యకు ప్రేరేపిచిన భర్తను దోషిగా తేల్చేందుకు అతను వేధింపులకు పాల్పడిన ఆరోపణలు సరిపోవని' కోర్టు అభిప్రాయపడింది. 'నేరం చేసినవారు శిక్ష నుంచి తప్పించుకోకూడదని, అలాగే.. చేసిన నేరాలకు చట్టపరమైన సాక్ష్యాల ఆధారంగానే శిక్ష విధించాలని' స్పష్టం చేసింది. పిటిషన్ దారు తన నిర్దొషిత్వం కోసం 1993 నుంచి 2024 వరకు అంటే 30 ఏళ్ల పాటు బాధను అనుభవించాడు. పైగా ఆత్మహత్య చేసుకున్న మహిళ తన 6 నెలల చిన్నారిని వదిలి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు కోణాల్లోనూ పరిశీలించిన తర్వాత తీర్పు ఇవ్వడం జరిగిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ వ్యవహారంలో మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన ప్రత్యక్ష, పరోక్ష కారణాలు ముఖ్యం. ఆమె ఆత్మహత్యకు వేధింపులే కారణమని ఊహించడానికి లేదని కోర్టు పేర్కొంది.