క్యాష్ ఫర్ క్వైరీ కేసు.. సీబీఐ ఎఫ్ఐఆర్ లో మహువా, దర్శన్ హీరానందానీ పేర్లు

by Shamantha N |
క్యాష్ ఫర్ క్వైరీ కేసు.. సీబీఐ ఎఫ్ఐఆర్ లో మహువా, దర్శన్ హీరానందానీ పేర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: క్యాష్ ఫర్ క్వెరీ కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రి, వ్యాపారవేత్త హీరా నందానీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సీబీఐ అధికారులు తెలిపారు. మహువా, హీరానందానీలపై నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇచ్చారనే ఆరోపణలు, నేరం చేసేలా ప్రేరేపించారు అని ఛార్జిషీటులో పేర్కొంది సీబీఐ.

దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి నగదు, బహుమతులు స్వీకరించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదు చేశారు. వాటికి బదులుగా గౌతమ్ అదానీ, మోడీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. ఈ కేసులో భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే ఫిర్యాదు మేరకు మహువాపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్‌ ఆదేశించింది. ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మహువా మోయిత్రాపై ఐపీసీ 203(ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని లోక్ పాల్ కోరింది. దీనితో పాటు ప్రతి నెలా దర్యాప్తు పురోగతిని లోక్‌పాల్‌కు తెలియజేయాలని కూడా సీబీఐని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed