- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Godses Ideology : గాడ్సే సిద్ధాంతాల ప్రకారం పాలనకు బీజేపీ కుట్ర : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
దిశ, నేషనల్ బ్యూరో : నాథురాం గాడ్సేను బీజేపీ నేతగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అభివర్ణించారు. గాడ్సే సిద్ధాంతాల ప్రకారం దేశాన్ని మార్చేందుకు కుట్ర పన్నిన బీజేపీని ఓడించేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.కర్ణాటకలోని బెళగావిలో రాష్ట్రకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ భారత్ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ‘‘మహాత్మాగాంధీ అంటే భారతదేశానికి మనస్సాక్షి లాంటి మహోన్నతుడు. ఇతర కోర్టుల కంటే మనస్సాక్షి అనేదే పెద్ద కోర్టు. ప్రజలంతా వారివారి మనస్సాక్షుల ప్రకారం నడుచుకోవాలి’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సూచించారు.
‘‘బీజేపీ ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడ కులం,మతం ప్రాతిపదికన ప్రజలను చీలుస్తుంది. ప్రజలకు అనుకూలమైన విధానాలను అమలుచేసిన చరిత్ర బీజేపీకి లేదు’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘‘నేటి కోర్టులలో ప్రతి ఒక్కరికీ న్యాయం దొరకకపోవచ్చు. అయినా మనం మనస్సాక్షి ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ఆయన సూచించారు.