One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోవాలని కేరళ అసెంబ్లీ తీర్మానం

by Prasad Jukanti |   ( Updated:2024-10-10 10:54:17.0  )
One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోవాలని కేరళ అసెంబ్లీ తీర్మానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో జమిలి ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల ఆలోచన విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమైఖ్యతకు హానికరం అని తీర్మానంలో పేర్కొంది. కాగా దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను మంత్రిమండలి ఓకే చెప్పింది. దీంతో రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో జమిలి ఎన్నికలకు దేశమంతటా సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం వ్యాఖ్యానించారు. ఇటువంటి తరుణంలో కేరళ అసెంబ్లీ జమిలిని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story