- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలులో ఉన్న ఆప్ ఎమ్మెల్యేకు లోక్‌సభ టికెట్ : కేజ్రీవాల్
దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం జైలులో ఉన్న గుజరాత్‌లోని దేదియాపడ ఎమ్మెల్యే చైతర్ వాసవను బరూచ్ లోక్‌సభ స్థానం నుంచి తమ అభ్యర్థిగా బరిలోకి దింపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.వాసవ జైలులో నుంచే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించారు. గుజరాత్‌లోని భరూచ్ పరిధిలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే నేత్రంగ్ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన సమాజం హక్కుల కోసం పోరాడుతున్నందు వల్లే గత నెలలో వాసవను రాష్ట్రంలోని బీజేపీ సర్కారు అరెస్టు చేయించిందని ఆరోపించారు. ఆదివాసీ వర్గాలను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందు వల్లే వాసవ గొంతువిప్పి మాట్లాడాల్సి వచ్చిందన్నారు. గిరిజనులు అంటే బీజేపీకి మొదటి నుంచే వైరిభావం ఉందని విమర్శించారు. పంజాబ్ సీఎం, గుజరాత్ ఆప్ నేతలతో కలిసి సోమవారం రోజు రాజ్‌పిప్లా జైలులో వాసవను కలుస్తామని ఢిల్లీ సీఎం చెప్పారు.