- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీకే శివకుమార్ డీఏ కేసును సీబీఐ నుంచి లోకాయుక్తకు బదిలీ చేసిన కర్ణాటక ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసును కర్ణాటక లోకాయుక్తకు బదిలీ చేయాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు. సీబీఐ నుంచి లోకాయుక్తకు కేసు బదిలీ చేయడం వెనుక మర్మం ఏమిటో చెప్పాలని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వ ఉత్తర్వులను కర్ణాటక కేబినెట్ రద్దు చేసిన తర్వాత కేసును లోకాయుక్తకు బదిలీ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సౌత్ ఫస్ట్‌కు ధృవీకరించింది.
ఈ కేసును లోకాయుక్తకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెందిన జైహింద్ టెలివిజన్ ఛానెల్‌కు సీబీఐ ఆదివారం నోటీసు జారీ చేసింది. దాని మేనేజింగ్ డైరెక్టర్‌ను జనవరి 11న బెంగళూరుకు పిలిపించింది. ఛానల్‌లో ఇన్వెస్టర్లలో శివకుమార్ ఉన్నాడు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.