- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ కొత్త చట్టం.. ఇకపై ఆ దేవాలయాల ఆదాయంలో 10 శాతం వసూలు
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎండోమెంట్ చట్టానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం బుధవారం హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖ బిల్లును సభలో మంత్రి ప్రవేశ పెట్టగా ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలో ఎండోమెంట్ బోర్డు పరిధిలో ఉండి.. రూ. కోటి, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల ఆదాయంలో 10 శాతాన్ని ప్రభుత్వం వసూలు చేయడానికి చట్టం అనుమతిస్తుంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ బిల్లు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన “ఖాళీ ఖజానా” నింపుకోవడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ కర్ణాటక విభాగం అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ఆదాయాన్ని ఎందుకు వసూలు చేస్తుందని ప్రశ్నించారు.
బీజేపీ నేతల ఆరోపణలను కర్ణాటక రవాణా శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి తోసిపుచ్చారు. దేవాలయాల నుంచి ప్రభుత్వం డబ్బు తీసుకోవడం లేదు. దానిని 'ధార్మిక పరిషత్' ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందిని చెప్పుకొచ్చారు. 'బీజేపీ కూడా తమ హయాంలో ఇలా చేసిందని, రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఆదాయం ఉన్న దేవాలయాల నుంచి 5 శాతం తీసుకున్నారు. రూ. 25 లక్షలకు పైబడిన ఆదాయానికి 10 శాతం తీసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇలా దేవాలయాల నుంచి ఆదాయం పొందడం కోసం కొత్త చట్టాన్ని తీసుకురావడం తో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలు, ముఖ్యంగా హిందువులు తీవ్ర వ్యతిరేకరత పెరుగుతోందని, పార్లమెంట్ ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.