- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంచన్‌జంగా రైలు ప్రమాదంలో అనేక లోపాలు.. విచారణ నివేదిక
దిశ, నేషనల్ బ్యూరో: గత నెల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కాంచన్ గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం అనేక మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పమాదంపై విచారణ జరిపిన రైల్వే సేఫ్టీ కమిషనర్(సీఎస్ఆర్) మంగళవారం సమర్పించిన నివేదికలో పలు సంచలన విషయాలు బహిర్గతం చేసింది. ప్రధానంగా డ్రైవర్ పొరపాటు కారణంగానే ప్రమాదం జరగలేదని, రైలు నిర్వహణలోనూ నిర్లక్ష్యం ఉందని పేర్కొంది. గతంలో రైల్వే బోర్డు ప్రమాదానికి డ్రైవరే కారణమని ఆరోపణలు చేసింది. అయితే, విచారణ జరిపిన సీఎస్ఆర్ నివేదిక.. రైల్వే శాఖ నిర్లక్ష్యానికి చెందిన అంశాలను బయటపెట్టింది. రైల్వే శాఖలో అనేక లోపాలు ఉన్నాయి. సిగ్నల్ వ్యవస్థ, స్టేషన్ మాస్టర్ సహా అన్నిటిని పేర్కొంది. రైలు నిర్వహణలో అధిక నిర్లక్ష్యం జరిగిందని స్పష్టం చేసింది. ఈ విషయంలో లోకో పైలట్‌ను మాత్రమే నిందించలేమని, సిగ్నల్ సమాచారం గూడ్స్ ట్రైన్ లోకో పైలట్‌కు చేరలేదు. ముందు ఏ రైలు ఉందనే విషయాన్ని తెలియజేయలేదు. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్‌కు శిక్షణ కూడా సరిగా ఇవ్వలేదని రైల్వే బోర్డుపై నివేదిక తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో రంగపాణి స్టేషన్ మాస్టర్ సైతం విధులు సరిగా నిర్వహించలేదని, ప్రమాదం జరిగిన లైన్‌లో ఆటోమెటిక్ సిగ్నల్స్ పాడైపోయాయని, నిర్వహణ పనులు సరిగా జరగలేదని వివరించింది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ ప్రాంతంలో రైలు నిర్వహణకు సంబంధించి లోకో పైలట్‌లు, స్టేషన్ మాస్టర్‌లకు సరైన కౌన్సెలింగ్‌ను ఇవ్వాలని నివేదిక సూచించింది. అలాగే, ప్రమాదం జరిగిన ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్) జోన్‌లో వాకీ-టాకీల కొరత కూడా ఉన్నట్టు దర్యాప్తులో వెళ్లడైంది. గూడ్స్ రైలు సిబ్బందికి ఇటువంటి భద్రతా సామగ్రి కూడా జారీ చేయలేదని నివేదిక పేర్కొంది.