KA Paul: సుప్రీంకోర్టులో కేఏ పాల్ కు చుక్కెదురు.. ఈవీఎంలపై వేసిన పిల్ కొట్టివేత

by Ramesh Goud |
KA Paul: సుప్రీంకోర్టులో కేఏ పాల్ కు చుక్కెదురు.. ఈవీఎంలపై వేసిన పిల్ కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీం కోర్టు(Supreme Court)లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కేఏ పాల్(Praja Shanti Party President Dr. KA Paul) కి చుక్కెదురైంది. ఈవీఎం(EVM)ల స్థానంలో పేపర్ బ్యాలెట్(Paper Balet) ను తిరిగి తీసుకురావాలని వేసిన పిల్(PIL) ను అత్యున్నత న్యాయస్తానం కొట్టేసింది(Dismissed). ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని కోరుతూ కేఏ పాల్ సహా పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్(Justice Vikram Nath) , జస్టిస్ పీబీ వరాలే(Justice PB Varale)లతో కూడిన ధర్మాసనం(bench) విచారణ జరిపింది. ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని, అమెరికా(America) వంటి దేశాలు ఉపయోగిస్తున్న భౌతిక బ్యాలెట్ పద్దతిని భారతదేశం కూడా అనుసరించాలని పిటిషనర్ వాదించారు.

అంతేగాక ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తాయని, ఎలోన్ మస్క్(Elon Musk) వంటి ప్రముఖులు కూడా ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు(CM Chandrababu), జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) సహా పలు రాజకీయ పార్టీలు(Political Parties), నేతలు(Leaders) కూడా తన వైఖరికి మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈ వాదనలను పరిగణలోకి తీసుకోలేదు. మీరు చెబుతున్నవారు ఓడిపోయినప్పుడు, ప్రత్యర్థులు గెలిచినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతారని, వారి మాటలను పరిగణలోకి తీసుకోలేమని చెబుతూ.. పిల్ కొట్టివేసింది. అంతేగాక ఇవన్నీ వాదించే ప్రదేశం ఇది కాదని సుప్రీం కోర్టు చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed