రైలులో మంటలు అని జనం పరుగులు.. మరో రైలు ఢీకొని ముగ్గురు మృతి

by Shamantha N |
రైలులో మంటలు అని జనం పరుగులు.. మరో రైలు ఢీకొని ముగ్గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ససారాం- రాంచీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. రైలులో మంటలు చేలరేగుతున్నట్లు పుకార్లు రావడం వల్ల భయంతో ట్రైన్ దిగి పరిగెడుతూ ముగ్గురు మృతి చెందారు. ఝార్ఖండ్ లాతేహర్లో సుమారు 8గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ససారాం నుంచి రాంచీకి వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగుతున్నట్లు పుకార్లు వ్యాపించాయి. కుమానిథ్ రైల్వే స్టేషన్ సమీపంలో అలారంను మోగించి ట్రైన్ను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయంతో రైలు నుంచి దిగి పక్కకు పరిగెత్తారు. ఈక్రమంలోనే పక్క ట్రాక్ నుంచి వస్తున్న మరో గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు చనిపోయారు.

మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్

మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ధన్ బాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు. అయితే, మంటలు చెలరేగుతున్నట్లు ఫోన్ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కాల్ చేసి వ్యక్తి ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, ఇది నక్సల్స్ చేసిన దుశ్చర్య కావచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed