జమ్ముకశ్మీర్ జాగ్నివి దళంపై కేంద్రం నిషేధం..

by Vinod kumar |   ( Updated:2023-02-17 16:14:44.0  )
జమ్ముకశ్మీర్ జాగ్నివి దళంపై కేంద్రం నిషేధం..
X

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించే సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలకు సహాకారం అందిస్తున్నారనే ఆరోపణలతో జమ్మూ అండ్ కశ్మీర్ జాగ్నవి ఫోర్స్ (జేకేజీఎఫ్)ను ఉగ్ర వ్యతిరేక చట్టం కింద శుక్రవారం నిషేధించారు. మరో వైపు పంజాబ్‌కు చెందిన హర్విందర్ సింగ్ సాంధును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది.

కాగా, జేకేజీఎఫ్ చొరబాట్లు పాల్పడుతున్నవారికి సహకరించడమే కాకుండా నార్కోటిక్స్, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రదాడులకు పాల్పడడం, భద్రతా దళాలను బెదిరింపులకు గురి చేసినట్లు గుర్తించామని కేంద్రం తెలిపింది. దీనికి తెహ్రీక్ ఈ ముజాయిద్దీన్, హర్కత్ ఉల్ జిహాద్ ఈ ఇస్లామి వంటి ఇతర ఉగ్ర సంస్థలతోనూ సంబంధాలున్నాయని వెల్లడించింది. ఇక సాంధు ప్రతస్తుం నిషేధిత బబ్బర్ ఖల్స ఇంటర్నేషనల్(బీకేఐ)తో లింకులు ఉన్నాయని పేర్కొంది. 2021లో పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై దాడికి కారణమైన వారిలో సాంధు ఒకడిగా ఉన్నాడు. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది.

Also Read...

ఆ పార్టీకి కఠిన పరిస్థితులు.. 2024 లోక్‌సభ ఎలక్షన్స్‌పై కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed