IPL Auction: ఫస్ట్ టైం ఐపీఎల్ వేలంలోకి జేమ్స్ అండర్సన్ ఎంట్రీ..

by Mahesh Kanagandla |
IPL Auction: ఫస్ట్ టైం ఐపీఎల్ వేలంలోకి జేమ్స్ అండర్సన్ ఎంట్రీ..
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2025 మెగా వేలంలో తొలిసారి ఇంగ్లాండ్ లెజెండ్, ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున జేమ్స్ అండర్సన్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేస్ బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఇటీవల ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు సైతం గుడ్ బై చెప్పాడు. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో వెస్టీండిస్‌తో ఈ ఏడాది జులైలో జరిగిన తొలి టెస్ట్‌లో చివరి సారిగా అండర్సన్ బరిలో నిలిచి రిటైరయ్యాడు. ఐపీఎల్ 2025 నవంబర్ 24, 25 తేదీలలో మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఇప్పటికే 1574 మంది ఆటగాళ్లు ఈ వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. 44 ఏళ్ల జేమ్స్ అండర్సన్ రూ.1.25 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరును వేలంలో రిజిస్టర్ చేసుకున్నాడు.

తొలిసారి ఐపీఎల్‌లో రిజిస్టర్ చేసుకున్న ఇటాలియన్ ప్లేయర్

ఇటలీకి చెందిన కుడి చేతి సీమర్ థామస్ డ్రాకా ఐపీఎల్ 2025 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇటలీ నుంచి రిజిస్టర్ చేసుకున్న తొలి ఆటగాడు అతడే కావడం విశేషం. ఆల్ రౌండర్ కేటగిరిలో తన పేరును డ్రాకా రిజిస్టర్ చేసుకుని బేస్ ప్రైస్ రూ.30లక్షలుగా పేర్కొన్నాడు. అయితే ఈ ఇటలీ ఆటగాడిని ఐపీఎల్ జట్లు కొనుగోలు చేస్తాయా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ ఏడాది జూన్‌లోనే డ్రాకా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. లగ్జమ్ బర్గ్ తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇటలీ జట్టు 77 పరుగుల తేడాతో గెలిచింది.

ఇతర దేశాల నుంచి రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్ల సంఖ్య ఇదే..!

మొత్తం 409 మంది ఓవర్సీస్ ప్లేయర్‌లు ఐపీఎల్ మెగా వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో ఆస్ట్రేలియా(76). సౌతాఫ్రికా(91), ఇంగ్లాండ్(52), న్యూజిలాండ్ (39), వెస్టిండీస్(33), అఫ్గానిస్తాన్, శ్రీలంక దేశాల నుంచి 29 మంది ప్లేయర్లు, యూఎస్ఏ(10), బంగ్లాదేశ్(13), ఐర్లాండ్(9), కెనడా(4), నెదర్లాండ్స్(12), జింబాబ్వే(8), స్కాట్లాండ్(2), యూఏఈ, ఇటలీ నుంచి ఒక్కో ఆటగాడు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed