‘జై సంవిధాన్’ నినాదాలు చేసినా తప్పేనా?..స్పీకర్ వ్యాఖ్యలపై ప్రియాంకా ఫైర్

by Vinod |
‘జై సంవిధాన్’ నినాదాలు చేసినా తప్పేనా?..స్పీకర్ వ్యాఖ్యలపై ప్రియాంకా ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో విపక్ష సభ్యులు జై సంవిధాన్ నినాదాలు చేయడంతో స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ స్పందించారు. పార్లమెంటులో జై సంవిధాన్ నినాదాలు కూడా చేయకూడదా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అధికార పక్షానికి చెందిన వ్యక్తులు పార్లమెంటులో అన్‌పార్లమెంటరీ, రాజ్యాంగ వ్యతిరేక నినాదాలు చేసినప్పుడు వారిని ఆపలేదు. కానీ ప్రతిపక్ష ఎంపీలు జై సంవిధాన్ నినాదాలు చేసినప్పుడు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల టైంలో ఉద్భవించిన రాజ్యాంగ వ్యతిరేక సెంటిమెంట్ ఇప్పుడు కొత్త రూపం దాల్చింది. ఇది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతును అణచివేయడానికి నిరంతరం కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Next Story

Most Viewed