- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
USA: భారత్- అమెరికా సంబంధాలపై డెమోక్రటిక్ నేత నీల్ మఖిజ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-అమెరికా సంబంధాలపై(India-US Partnership) డెమొక్రటికి పార్టీ నేత(Democratic Leader) నీల్ మఖిజా(Neil Makhija) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల సంబంధాలు అత్యంత కీలకమైనవని అని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కమలా హ్యారిస్(Kamala Harris) విజయం సాధిస్తే ఈ సంబంధాలను తర్వాతి దశకు తీసుకెళ్తారన్నారు. ఇప్పటికే ఆమె ఇరు దేశాల భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని గుర్తించారన్నారు. అమెరికా రక్షణ, పర్యావరణ వంటి ప్రపంచ సమస్యల విషయంలో భారత్‌తో కలిసి అమెరికా పనిచేయాల్సిన అవసరాన్ని కమలా గుర్తించారని మఖిజా వెల్లడించారు. అదే సమయంలో ప్రజాస్వామ్యానికి ట్రంప్ వల్ల(Donald Trump) ముప్పు ఉందని అన్నారు. ఆయన చీకటి కార్యకలాపాల్లో పాల్గొన్నారని తెలిపారు. కనీసం ఎన్నికల్లో ఓటు హక్కు కూడా లేని వలసదారులను బలిపశువులుగా ట్రంప్ చేశారని ఆరోపించారు. దేశంలో సమస్యలకు వలసదారులనే ట్రంప్ సాకుగా చూపుతున్నారని తప్పుపట్టారు. అది వాస్తవం కాదని.. ఆయన కేవలం ఉద్రిక్తతలను రాజేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక వలస పాలసీలను కఠినతరం చేసి.. అతి భారీ స్థాయిలో వలసదారులను సాగనంపుతామంటున్నారని గుర్తు చేశారు.
ఎవరీ మఖిజా?
ఇకపోతే, మఖిజా ప్రస్తుతం మాంటగోమెరీ కౌంటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు.. ఛైర్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పెన్సిల్వేనియా చరిత్రలో ఆ పదవికి ఎన్నికైన అతి చిన్నవయస్కుడు ఆయనే. హ్యారిస్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మఖిజాకు పేరుంది. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీవ్రంగా విమర్శించే వ్యక్తిగా అతడికి పేరుంది. ఒకవేళ కమల ఎన్నికైతే అతడు ఆమె కేబినెట్‌లో కచ్చితంగా ఉంటాడని డెమోక్రాట్లు విశ్వసిస్తున్నారు.