Pantsir : భారత గగనతలానికి ‘పాంట్సిర్’ రక్షణ కవచం.. రష్యాతో కీలక ఒప్పందం

by Hajipasha |
Pantsir : భారత గగనతలానికి ‘పాంట్సిర్’ రక్షణ కవచం.. రష్యాతో కీలక ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా(Russia), భారత్(India) మధ్య మరో కీలక రక్షణరంగ ఒప్పందం కుదిరింది. రష్యాకు చెందిన ‘పాంట్సిర్’(Pantsir) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కు ‌సంబంధించిన కొత్త వేరియంట్లను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఇరుదేశాలు జట్టుకట్టాయి. ఇందుకోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), రష్యా ప్రభుత్వ ఆయుధ ఎగుమతి కంపెనీ ‘రోసో బోరోన్ ఎక్స్‌పోర్ట్’ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.

ఎంఓయూపై బీడీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎ.మాధవరావు, ‘రోసో బోరోన్ ఎక్స్‌పోర్ట్’ కంపెనీ నౌకాదళ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జర్మన్ కొవలెంకో సంతకాలు చేశారు. గోవాలో జరిగిన భారత్ - రష్యా ప్రభుత్వాల అధికార ప్రతినిధుల సబ్ గ్రూపు సమావేశం వేదికగా ఈ ఎంఓయూ కుదిరింది. శత్రుదేశాల మిస్సైళ్లు, యుద్ధ విమానాలను గాల్లోనే కూల్చి వేసేందుకు పాంట్సిర్ క్షిపణి వ్యవస్థ ఉపయోగపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed