లింగ సమానత్వంలో అట్టడుగున భారత్.. తొలి స్థానంలో ఐస్‌ల్యాండ్

by Vinod kumar |
లింగ సమానత్వంలో అట్టడుగున భారత్.. తొలి స్థానంలో ఐస్‌ల్యాండ్
X

న్యూఢిల్లీ : లింగ సమానత్వం అంటే స్త్రీ, పురుషులను సమదృష్టితో చూడటం. ఈ విషయంలో భారత్ అట్టడుగున 127వ స్థానంలో నిలిచింది. లింగ సమానత్వం అమలులో 146 ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన గ్లోబర్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో భారత్‌ చివరి నుంచి 20వ ప్లేస్(127)లో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇండియా ర్యాంక్ ఎనిమిది స్థానాలు (1.4 శాతం పాయింట్లు) మెరుగుపడింది.

2022 డబ్ల్యూఈఎఫ్ నివేదికలో మన దేశానికి 135వ ర్యాంక్ వచ్చింది. తాజాగా 127వ ర్యాంక్ ను సాధించడంతో భారత్ లో లింగ సమానత్వం పరిస్థితి పాక్షికంగా 2020 నాటి స్థాయికి చేరిందని నివేదిక పేర్కొంది. భారత్‌లో వేతనాలు, ఆదాయం విషయాల్లో లింగ సమానత్వం ఉన్నప్పటికీ.. సీనియర్ పొజిషన్లు, టెక్నికల్ బాధ్యతల కేటాయింపులో మహిళలకు దక్కే అవకాశాలు బాగా తగ్గిపోయాయని నివేదిక తెలిపింది.

రాజకీయ సాధికారతలో భారత్‌ 25.3 శాతం సమానత్వాన్ని నమోదు చేసింది. లింగ సమానత్వంలో పొరుగుదేశాలు మనకంటే బెటర్ ర్యాంకులు సంపాదించాయి. బంగ్లాదేశ్‌ కు 59, చైనాకు 107, శ్రీలంకకు 115, నేపాల్‌ కు 116, భూటాన్‌ కు 103వ ర్యాంక్‌లు వచ్చాయి. ఇక ఈవిషయంలో పాకిస్థాన్‌ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడి ఉంది. ఆ దేశం 142వ స్థానంలో నిలిచింది. ఐస్‌లాండ్ వరుసగా 14వ ఏడాది కూడా గ్లోబర్‌ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌లో తొలిస్థానంలో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed