కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన అమిత్ షా

by Harish |
కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన అమిత్ షా
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ‘4సీ’ ఫార్ములాతో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని మండిపడ్డారు. హస్తం పార్టీ పాటించే 4సీ ఫార్ములాలో కరప్షన్, కమీషన్, కమ్యూనలిజం, క్రిమినల్ పాలిటిక్స్ ఉన్నాయని ఎద్దేవా చేశారు. శనివారం మధ్యప్రదేశ్‌లోని కరేరాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ అమిత్‌‌షా ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ నేతలు ఏదైనా రాష్ట్రాన్ని పాలిస్తే.. తమ ఇళ్లను, జేబులను నింపుకోవడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని ఆరోపించారు. ‘‘కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజూ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి బాంబు పేలుళ్లకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ నాయకత్వ పటిమ వల్ల దేశమంతటా శాంతి పరిఢవిల్లుతోంది’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.

“కశ్మీర్‌లోని పుల్వామా, యూరి సెక్టార్‌లలో పాకిస్తాన్ ఉగ్రదాడులు చేయించింది. ఇది జరిగిన 10 రోజుల్లోనే భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించింది. వైమానిక దాడులు నిర్వహించి ఉగ్రవాదులను అంతమొందించి తిరిగి వచ్చింది. దేశ సరిహద్దుల భద్రతకు మోడీ నాయకత్వంలో లభించినంత భరోసా మరెప్పుడూ లభించలేదు’’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed