ఈ వివాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ షాకింగ్ రియాక్షన్

by Gantepaka Srikanth |
ఈ వివాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ షాకింగ్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: జానీ మాస్టర్ వివాదంపై ప్రముఖ టాలీవుడ్(Tollywood) ప్రొడ్యూసర్ సి. కల్యాణ్(C. Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఈ అంశంపై మాట్లాడారు. జానీ మాస్టర్(Johnny Master) కేసు వెనుక పెద్ద కుట్ర జరుగుతున్నదని సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలు తనకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు ముందు ఇండస్ట్రీలో ఫిర్యాదు చేయాల్సి ఉండే అని అభిప్రాయపడ్డారు. ఇక్కడ న్యాయం జరుగకపోతే పోలీసులను ఆశ్రయిస్తే బావుండేది అన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలోకి వెళ్లింది. అసలు నేరం జరిగిందా? లేదా? అనేది తెలియాల్సి ఉందని అన్నారు. నాలుగేళ్ల కింద అత్యాచారయత్నం చేస్తే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న అన్నారు. ఎప్పుడో ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు ఎలా నిరూపించగలమని అనుమానం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. అసలు దీనికి పోక్సో కేసు ఎలా వర్తిస్తుందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఇవాళ జానీ మాస్టర్‌కు ఒక గుర్తింపు, జాతీయ స్థాయిలో అవార్డు వచ్చాకే ఆమెకు అన్యాయం జరిగిందని గుర్తుకు వచ్చిందా? మండిపడ్డారు. నిజంగా ఆమెకు అన్యాయం జరిగి ఉంటే.. జానీ మాస్టర్‌కు శిక్ష పడాల్సిందే.. అందులో అనుమానం అవసరం లేదు. ఇలాంటివి తాము ఎంకరేజ్ చేయబోం అని అన్నారు. కానీ, సదరు యువతికి మాస్టర్ కార్డు రానివ్వకుండా జానీ మాస్టర్ అడ్డుకున్నారనేది పచ్చి అబద్ధం. స్వయంగా దగ్గరుండి ఆయనే ఇప్పించాడనేది నిజమని స్పష్టం చేశారు. తమకు ఇండస్ట్రీలో అందరూ సమానమే. మాకు కులం, మతం లేదని చెప్పారు. ఇలాంటి ఇష్యూస్ వల్ల ఇండస్ట్రీకి పెద్ద డ్యామేజ్ జరుగుతోందని అన్నారు. ఛానళ్లు, యూట్యూబ్‌లు ఉన్నాయని ఎవరికి నచ్చింది వారు రాసుకుంటున్నారని ఆవేదన చెందారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ అంశాన్ని కొందరు వాడుకుంటున్నారని సి.కల్యాణ్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed