Balakrishna: ఆయన కృషి, కీర్తి ప్రతి నటునికి మార్గదర్శకం.. బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ నోట్

by Hamsa |
Balakrishna: ఆయన కృషి, కీర్తి ప్రతి నటునికి మార్గదర్శకం.. బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ నోట్
X

దిశ, సినిమా: (సెప్టెంబర్ 20) నేడు అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి కావడంతో ఆయనను సినీ ప్రముఖులు స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నాగేశ్వర రావు నటనపై ఓ నోట్ విడుదల చేశారు. ‘‘తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయం.

ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం. నాటక రంగం నుంచి చిత్రరంగం వరకు ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఈ రోజు ఆయనకు మనమందరం నివాళి అర్పిస్తూ, నటనకు, కృషి పట్టుదలతో వెలసిన విజయాలు స్మరించుకుందాం’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story