Delhi Drug Haul: ఢిల్లీ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠా హస్తం

by Shamantha N |
Delhi Drug Haul: ఢిల్లీ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠా హస్తం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో పట్టుబడిన రూ. వేల కోట్ల విలువైన కొకైన్‌ (Delhi Drug Haul) స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. ఈ స్మగ్లింగ్ వెనుక దుబాయ్‌లో ఉంటున్న భారత పౌరుడు వీరేంద్ర బసొయాను దీనికి మాస్టర్‌మైండ్‌గా గుర్తించారు. ప్రధాన నిందితుడు తుషార్ గోయల్ తో వీరేంద్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు. మరోవైపు, కేసులో అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే ఈ కేసులో ఐదో నిందితుడు జితేంద్ర పాల్‌ సింగ్‌ అలియాస్‌ జెస్సీ గురువారం యూకేకు పారిపోయేందుకు యత్నిస్తుండగా అమృత్‌సర్‌లో అరెస్టు చేశారు. ఇకపోతే, జెస్సీ గత 17 ఏళ్లుగా యూకేలోనే ఉంటున్నాడు. కానీ, అతడు భారత్‌లో డ్రగ్స్ బిజినెస్ ని పర్యవేక్షించేందుకు పంజాబ్ చేరుకున్నాడు. ఢిల్లీలో అరెస్టులతో అప్రమత్తమై తిరిగి యూకే వెళ్లేందుకు యత్నిస్తుండగా అరెస్టు చేశారు. ఇటీవల పట్టుబడిన నిందితులను విచారించగా.. వారు దుబాయ్‌లోని వీరేంద్ర పేరును చెప్పారు.

పూణేలో రూ.3 వేల కోట్ల డ్రగ్స్

గతేడాది పూణేలో స్వాధీనం చేసుకొన్న రూ. 3,000 కోట్ల మ్యావ్‌-మ్యావ్‌ కేసులోనూ వీరేంద్ర బసొయా హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పట్లో పోలీసులు ఢిల్లీలోని వద్ద పిలాంజిలోని ఇతడి ఇంటిపై దాడి చేశారు. కానీ, అతను తప్పించుకున్నాడు. యూపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమార్తెతో వీరేంద్ర కుమారుడి వివాహం గతేడాది జరిగింది. గతంలో వీరేంద్ర కుమారుడిని పోలీసులు డ్రగ్‌ కేసులో అరెస్టు చేసినా.. బెయిల్‌పై వెంటనే బయటకు వచ్చాడు. ఆ తర్వాత దుబాయ్‌కు మకాం మార్చి అంతర్జాతీయ డ్రగ్‌ సిండికేట్‌తో కలిసి కార్యకలాపాలు నిర్వహించాడు. ఇకపోతే, ప్రధాన నిందితుడైన తుషార్‌ గోయల్‌తో కలిసి వీరేంద్ర డ్రగ్స్ దందా చేస్తున్నాడు. దుబాయ్‌ నుంచి వచ్చే ప్రతీ కొకైన్‌ కన్సైన్‌మెంట్‌కు రూ.3 కోట్లు ఇస్తానని అతడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Next Story

Most Viewed