మేము అలా చేసి ఉంటే దేశభక్తులం అయ్యేవాళ్లం: రెజ్లర్ బజరంగ్

by Mahesh |
మేము అలా చేసి ఉంటే దేశభక్తులం అయ్యేవాళ్లం: రెజ్లర్ బజరంగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన భారత మాజీ రెజ్లర్లు బజరంగ్ పునియాకు కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు దక్కాయి. దీంతో వచ్చి రాగానే ఆయన బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు కుమారుడిగా తాను రైతుల ఆందోళనలను మరింత మెరుగ్గా లేవనెత్తుతానని చెప్పుకొచ్చారు. అలాగే తాను, వినేష్ ఫోగట్ బీజేపీలో చేరి ఉంటే దేశభక్తులం అయ్యేవాళ్లం. కానీ ఇప్పుడు మాపై దేశ 'వ్యతిరేకులు' ట్యాగ్ వేశారని అన్నారు. “నేను క్రీడాకారుడిని, రైతు కుమారుడిని, పార్టీ ఇచ్చిన బాధ్యత ప్రకారం, నేను రైతుల ఆందోళనలను మెరుగైన మార్గంలో లేవనెత్తుతామని భావిస్తున్నాను. మా నాయకుడు రాహుల్‌గాంధీ వెంటే యువత, క్రీడాకారులు రైతులు, మేమంతా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed