Suicide: గ్యాంగ్ స్టర్ తో వెళ్లిపోయిన ఐఏఎస్ భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

by Shamantha N |   ( Updated:2024-07-23 09:12:46.0  )
Suicide: గ్యాంగ్ స్టర్ తో వెళ్లిపోయిన ఐఏఎస్ భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: గ్యాంగ్ స్టర్(Gangster) తో పారిపోయిన ఐఏఎస్(IAS Officer) భార్య ఆత్మహత్యకు పాల్పడింది. గ్యాంగ్ స్టర్ తో పారిపోయిన మహిళ కొన్ని నెలల తర్వాత తన భర్త ఇంటికి చేరుకోవడం.. అక్కడి సిబ్బంది ఆమెను లోనికి రానివ్వలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి గుజురాత్(Gujarat) రాజధాని గాంధీనగర్ లో సెక్టార్ 19లో నివాసం ఉంటుంన్నారు. గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్‌లో సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. అయితే ఆయన భార్య కొన్ని నెలల క్రితం తన స్వస్థలమైన తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌స్టర్ హైకోర్టు మహారాజా‌తో పారిపోయినట్టుగా తెలుస్తోంది. 2023 నుంచి వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆమె నుంచి విడాకులు పొందేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి చేస్తున్నట్టుగా సమాచారం.

కిడ్నాప్ కేసులో ప్రమేయం

అదే సమయంలో తన వద్ద నుంచి వెళ్లిపోయిన భార్యను తన ఇంట్లోకి రానివ్వొద్దని ఐఏఎస్ అధికారి సహాయకులకు సూచించారు. అయితే, శనివారం మహిళ అధికారి నివాసానికి చేరుకుంది. కానీ, సిబ్బంది ఆమెను లోనికి రానివ్వలేదు. దీంతో, భవనం ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను గాంధీనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. తమిళంలో రాసి ఉన్న సూసైడ్ లెటర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే, తమిళనాడు(Tamilnadu)లో ఓ బాలుడిని కిడ్నాప్(Kidnap) కేసులోని అధికారి భార్య ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ హైకోర్టు మహారాజా, అతని సహాయకుడు సెంథిల్ ఓ బాలుడ్ని జులై 11న కిడ్నాప్ చేశారు. అతడ్ని వదలిపెట్టేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు బాలుడ్ని కాపాడారు. ఈ కేసులో అధికారి భార్యకు కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి కిడ్నాప్ కేసులో తమిళనాడు పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకే మహిళ తన భర్త ఇంటికి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. దాదాపు 9 నెలల క్రితం భర్తను వదిలి పెట్టిన మహిళ.. అప్పట్నుంచి గుజరాత్ లో ఉండట్లేదు.

Advertisement

Next Story

Most Viewed