బర్త్‌డే వేళ కేజ్రీవాల్‌ ఎమోషనల్‌.. ఆయన్ను మిస్‌ అవుతున్నానంటూ ట్వీట్

by Harish |   ( Updated:2023-08-16 11:21:34.0  )
బర్త్‌డే వేళ కేజ్రీవాల్‌ ఎమోషనల్‌.. ఆయన్ను మిస్‌ అవుతున్నానంటూ ట్వీట్
X

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన బర్త్‌డే వేళ బుధవారం ఎమోషనల్ అయ్యారు. పుట్టినరోజు నాడు తనతోపాటు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా లేకపోవడం బాధాకరమన్నారు. "నేను మనీశ్‌ను చాలా మిస్‌ అవుతున్నా. తప్పుడు కేసులో తను జైల్లో ఉన్నాడు" అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. "మనీశ్‌కు సంతోషం కలిగించే విధంగా మనమంతా దేశంలోని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రతిజ్ఞ చేయాలి" అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. ఇక కేజ్రీవాల్‌‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed