Rajya Sabha: నేను కేవలం ఒక్క రూ.500 నోటే తీసుకెళ్లా.. అభిషేక్ మను సింఘ్వీ

by Shamantha N |
Rajya Sabha: నేను కేవలం ఒక్క రూ.500 నోటే తీసుకెళ్లా.. అభిషేక్ మను సింఘ్వీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ(Abhishek Manu Singhvi) సీటు వ‌ద్ద నోట్ల కట్టలను గుర్తించారు. ఈ అంశంపై ఎగువ సభలో(Currency Notes in Rajya Sabha) దుమారం రేగింది. కాగా.. ఈ అంశంపై అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. రాజ్య‌స‌భ‌కు వెళ్తున్న స‌మ‌యంలో.. ఒకే ఒక్క రూ.500 నోటు ప‌ట్టుకెళ్లుతాన‌ని సింఘ్వీ తెలిపారు. త‌న సీటు వ‌ద్ద నోట్ల క‌ట్ట‌లు ఉన్న విష‌యాన్ని మొద‌టిసారి విన్న‌ట్లు చెప్పారు. గురువారం రోజున మ‌ధ్యాహ్నం 12.57 నిమిషాల‌కు స‌భ‌లోకి వెళ్లాన‌ని, ఆ త‌ర్వాత స‌రిగ్గా ఒంటి గంటకు స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఆ త‌ర్వాత క్యాంటీన్‌లో అయోధ్య రామిరెడ్డితో క‌లిసి మ‌ధ్యాహ్నం 1.30 నిమిషాల వ‌ర‌కు కూర్చున్న‌ట్లు చెప్పారు. స‌భ‌లో 3 నిమిషాలు, క్యాంటిన్‌లో 30 నిమిషాలు మాత్ర‌మే ఉన్నాన‌ని, దీనిపై కూడా రాజ‌కీయం చేస్తున్న‌ట్లు తెలిపారు.

రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం

రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌కు((Congress) ) చెందిన ఓ ఎంపీ సీటు వద్ద దీన్ని గుర్తించినట్లు ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధంఖర్ (Jagdeep Dhankhar) శుక్రవారం సభలో ప్రకటించడం తీవ్ర దుమారానికి దారితీసింది. రాజ్య‌స‌భ‌లో 222 సీటు నెంబ‌ర్‌లో నోట్ల కట్టను గుర్తించినట్లు తెలిపారు. అయితే ఆ సీటు వ‌ద్ద న‌గ‌దు ల‌భించిన అంశంపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఛైర్మన్ జగదీప్ దంఖర్ తెలిపారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇకపోతే, రాజ్య‌స‌భ‌లో 222 సీటు నెంబ‌ర్‌ను అభిషేక్ మ‌ను సింఘ్వీకి కేటాయించారు. దీంతో, ఈ వ్యాఖ్యలపైనే అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు.

Next Story

Most Viewed